GET LPG GAS CYLINDER WITH RS 800 DISCOUNT BY BOOKING THROUGH PAYTM APP NS
LPG Cylinder Booking Offer: గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే, ఇలా బుక్ చేసి రూ. 800 డిస్కౌంట్ అందుకోండి
పెరిగిన ధరలతో ప్రజలు గ్యాస్ బుక్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇలా బుక్ చేస్తే గ్యాస్ సిలిండర్ పై రూ. 800 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.
గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండగా మారాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.861గా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
ఇప్పటికే కరోనా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న సామాన్యులకు గ్యాస్ ధరలు మరింత ఇబ్బందిగా మారాయి. ఉద్యోగాలు, ఉపాధి పోయి ఇబ్బంది పడుతున్న అనేక మంది రూ. 861 పెట్టి గ్యాస్ కొనడానికి అవస్థలు పడుతున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్స్ యాప్ Paytm గ్యాస్ సిలిండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై రూ. 800 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నట్లు పేటీఎం ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
ఈ ఆఫర్ ఈ నెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొదటి సారి పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
ఈ ఆఫర్ పొందడం కోసం గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
1.మొదటగా పేటీఎం యాప్ లేకపోతే డౌన్ లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం ‘Recharge and Pay Bills’ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
2. తర్వాత మనకు ‘book a cylinder’ ఆప్షన్ కనిపిస్తుంది. అనంతరం మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకుని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
3. అనంతరం ‘Proceed to Pay’ ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. మొదటి సారి బుక్ చేసిన వారికి అటోమెటిక్ గా ఆఫర్ అప్లై అవుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
4.గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు లభిస్తుంది. ఆ స్క్రాచ్ కార్డును ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
5. క్యాష్ బ్యాక్ రూ. 10 నుంచి రూ.800 ఎంతైనా రావొచ్చు. స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుందని పేటీఎం తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)