మీరు సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ పొందాలని భావిస్తే.. ఎస్బీఐ యోనో ద్వారా అప్లై చేసోవచ్చు. దీని కోసం మీరు ఎస్బీఐ యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. ఎస్బీఐ యోనో యాప్ లేకపోతే గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్టర్ చేస్తుకోవాలి.
ఇకపోతే హోమ్ లోన్ పొందాలని భావించే వారిని ఎస్బీఐ హెచ్చరిస్తోంది. ఓటీపీ, యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవ్వరికీ షేర్ చేయవద్దని సూచిస్తోంది. అలాగే బ్యాంక్ అధికారులకు కూడా తెలియజేయవద్దని కోరింది. ఇంకా గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్, మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మోసపూరితమైన లింక్స్ ఉండే అవకాశం ఉందని, అందువల్ల వీటిపై క్లిక్ చేయవద్దని కోరింది.