1. కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కరోనా వైరస్ మహమ్మారి కన్నా ముందుతో పోలిస్తే ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Diesel Prices) ఎక్కువగా ఉన్నాయి. దీంతో వాహనాలు బయటకు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. ప్రతీ నెలా పెట్రోల్ బడ్జెట్ భారం అవుతోంది. మీరు కూడా పెట్రోల్, డీజిల్ ధరలకు భయపడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. (ప్రతీకాత్మక చిత్రం)
2. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ రూపొందించింది. ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ (INDIANOIL AXIS BANK RuPay Credit Card) పేరుతో ఈ క్రెడిట్ కార్డ్ అందుబాటులో ఉంది. ఈ క్రెడిట్ కార్డుతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్, రివార్డ్స్, డిస్కౌంట్స్ కూడా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ తీసుకునేవారికి వెల్కమ్ గిఫ్ట్ కింద 100 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. క్రెడిట్ కార్డు తీసుకున్న మొదటి 30 రోజుల్లో పెట్రోల్, డీజిల్, ఇతర ఫ్యూయెల్ కోసం ఉపయోగిస్తే 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. గరిష్టంగా రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇక రూ.200 నుంచి రూ.5,000 మధ్య పెట్రోల్, డీజిల్ కొంటే 1 శాతం సర్‌ఛార్జీ మినహాయింపు లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఇండియన్ ఆయిల్ ఫ్యూయెల్ ఔట్‌లెట్స్‌లో ప్రతీ రూ.100 ఖర్చు చేస్తే 4 శాతం రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డుతో బుక్ మై షో వెబ్సైట్ లేదా యాప్‌లో సినిమా టికెట్లు కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పార్ట్నర్ రెస్టారెంట్స్‌లో 20 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఆన్లైన్ షాపింగ్, గ్రాసరీస్, బిల్ పేమెంట్స్, ఇతర చెల్లింపులపై ప్రతీ రూ.100 పై 1 శాతం రివార్డ్ పాయింట్ పొందొచ్చు. ఈ క్రెడిట్ కార్డుతో ఒక ఏడాదిలో రూ.50,000 పైన ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. వీటితో పాటు కస్టమర్లకు లాయల్టీ పాయింట్స్ కూడా లభిస్తాయి. ప్రతీ రూ.100 పై ఒక ఎడ్జ్ రివార్డ్ పాయింట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు కూడా ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డు కోసం యాక్సిస్ బ్యాంకులో లేదా బ్యాంకు వెబ్సైట్లో అప్లై చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ల అవసరాలను బట్టి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల్ని అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, స్పైస్‌జెట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, విస్తారా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లాంటి అనేక క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)