జెమోపి రైడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. క్విక్ చార్జ్ ఫీచర్ ఉంది. 2 గంటల్లోనే 80 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేస్తే 90 నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంది.
ఇంకా ఇందులో డిజిటల్ స్పీడో మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కూడా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇది నాలుగు కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు లభిస్తోంది. అందువల్ల మీకు నచ్చిన వెహికల్ కొనుగోలు చేయొచ్చు. స్పీడ్ తక్కువగా ఉంటుంది. అందుకే వీటికి లైసెన్స్ అవసరం ఉండదు.