Miso Electric Scooter: రూ.44 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కి.మి వెళ్లొచ్చు!
Miso Electric Scooter: రూ.44 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 కి.మి వెళ్లొచ్చు!
Affordable Electric Scooter | మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే తీపికబురు. తక్కువ ధరలోనే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది.
Cheap Electric Scooter | తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. చౌక ధరలో ఒక ఎలక్ట్రిక స్కూటర్ అందుబాటులో ఉంది. అలాగే ఇందులో అదిరే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంతకీ అది ఏ స్కూటర్ అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
2/ 9
గేమోపై అనే కంపెనీ పలు రకాల మోడళ్లను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిల్లో మిసో అనే మోడల్ కూడా ఒకటి ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
3/ 9
దేశీ తొలి సోషల్ డిస్టెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. దీన్ని మిని ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవచ్చు. కంపెనీ ఇందులో 250 వాట్ హబ్ మోటార్ అమర్చింది. ఇది గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది.
4/ 9
బ్యాటరీ 90 శాతం ఫుల్ కావడానికి 2 నుంచి 3 గంటలు టైమ్ పడుతుంది. బ్యాటరీ కెపాసిటీ 48 వీ 17.5 ఏహెచ్. డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడానికి లైసెన్స్ ఉండాల్సిన పని లేదు.
5/ 9
అంతేకాకుండా ఈ మిని ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డిజిటల్ స్పీడో మీటర్ ఉంటుంది. వివిధ రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. రెడ్, ఆరెంట్, బ్లూ, గ్రీన్ వంటి నాలుగు రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తోంది.
6/ 9
ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఫుల్‌గా చార్జ్ చేస్తే 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. కంపెనీ ఇందులో డ్రమ్ బ్రేక్స్ సిస్టమ్‌ను అమర్చింది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. అందువల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. బ్యాటరీ ఫుల్ కావడానికి 3 నుంచి 4 గంటలు టైమ్ పట్టొచ్చు.
7/ 9
ఈ మిని ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 44 వేలుగా ఉంది. ఆన్‌రోడ్ ధర రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ట్రడిషనల్ టెలీ స్కోపిక్ ఫోర్స్క్ అమర్చారు.
8/ 9
ఎలక్ట్రిక్ స్కూటర్లో బాడీ ప్యానెల్స్ ఏమీ లేవు. అయితే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఉంటుంది. ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కూడా అమర్చారు. ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు కూడా ఉన్నాయి.
9/ 9
మీరు పర్సనల్ మొబిలిటీ లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందుబాటులో ధరలో పొందాలని భావిస్తూ ఉంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. దీన్ని మీరు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ పనులకు వాడుకోవచ్చు. ఇది 125 కేజీల వరకు బరువును లాగగలదు.