చెక్ రిటర్న్ ఇన్వర్డ్, ఔట్వర్డ్, లోకల్, ఔట్స్టేషన్ సేవలకు సంబంధించి టెక్నికల్ రీజన్స్ వల్ల చెక్ రిటర్న్ జరిగితే ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే ఇప్పుడు మాత్రం రూ. 1000లోపు చెక్ అమౌంట్ ఉంటే చార్జీ రూ. 200 చెల్లించుకోవాలి. అదే రూ. 1000 నుంచి రూ. 10 లక్షల మధ్యలో చెక్ అమంట్ ఉంటే రూ. 300 చార్జీ పడుతుంది.
యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు కచ్చితంగా రూ. 500 కలిగి ఉండాలి. ఇది గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుంది. అదే పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అయితే మినిమమ్ బ్యాలెన్స్ రూ. 1000 ఉండాలి. ఇక పట్టణాలు, మెట్రో ప్రాంతాల్లో అయితే యావరేజ్ మినిమమ్ బ్యాలెన్స్ రూ. 2 వేలుగా ఉంది.
పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 999 నుంచి రూ. 700 అయితే రూ. 25 కట్టాలి. రూ. 699 నుంచి రూ. 400 వరకు అయితే రూ. 35 చెల్లించాలి. రూ. 399 నుంచి తక్కువ అయితే రూ. 45 చార్జీ పడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రూ. 499 నుంచి రూ. 350 వరకు అయితే రూ. 25 కట్టాలి. రూ. 349 నుంచి రూ.200 వరకు అయితే రూ. 35 చెల్లించాలి. ఇక రూ. 199 నుంచి తక్కువ అయితే రూ. 45 చార్జీ పడుతుంది. జీఎస్టీ అదనంగా ఉంటుంది.
ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ఫండ్ ట్రాన్స్ఫర్ (ఐఎంపీఎస్) విషయానికి వస్తే.. రూ.1000లోపు అమౌంట్‌కు చార్జీలు ఉండవు. రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు అయితే రూ. 3, రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు రూ. 5, రూ. 25 వేల నుంచి రూ.లక్ష వరకు రూ. 8, రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ. 15, రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రూ. 20 చార్జీలు చెల్లించాలి. జీఎస్టీ అదనం.