Bank Money Draw With Face ID: ఫేస్ ఐడీతో డబ్బులు డ్రా.. బ్యాంకుల కొత్త ఆలోచన..
Bank Money Draw With Face ID: ఫేస్ ఐడీతో డబ్బులు డ్రా.. బ్యాంకుల కొత్త ఆలోచన..
Bank Money With Draw: ప్రస్తుతం స్మార్ట్ఫోన్లను అన్‌లాక్ చేయడానికి ఫేస్ ID ఉపయోగించబడుతుంది. అయితే.. త్వరలో ఈ టెక్నాలజీని బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి కూడా ఉపయోగించనున్నారు.
ప్రస్తుతం స్మార్ట్ఫోన్లను అన్‌లాక్ చేయడానికి ఫేస్ ID ఉపయోగించబడుతుంది. అయితే.. త్వరలో ఈ టెక్నాలజీని బ్యాంక్ నుండి డబ్బు విత్‌డ్రా చేయడానికి కూడా ఉపయోగించనున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవాలంటే విత్ డ్రా ఫారమ్ మీద సైన్ ఉంటే సరిపోతుంది.
2/ 7
అయితే ఇప్పుడు కళ్ల ముఖం, రెటీనా స్కాన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ లావాదేవీల కోసం ఫేస్ ఐడి మరియు ఐరిష్ స్కానింగ్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది . అయితే.. అన్ని లావాదేవీలకు ఫేస్ ఐడి అవసరం లేదు. దీంతో పన్ను ఎగవేత తగ్గుతుందని ప్రభుత్వం పేర్కొంది.
3/ 7
నివేదికల ప్రకారం.. కొన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ బ్యాంకులు ఫేస్ ఐడి మరియు ఐరిష్ స్కానింగ్‌ను ప్రవేశపెట్టాయి. బహిరంగ ప్రకటన వెలువడనప్పటికీ బ్యాంకులు దీనిపై బ్యాంకులు కసరత్తు ప్రారంభించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఫేస్ ఐడి వెరిఫికేషన్ తప్పనిసరి కాదు. ఖాతాదారునికి ప్రభుత్వ గుర్తింపు కార్డు, పాన్ కార్డు లేనప్పుడు ఈ సాంకేతికత ఉపయోగించబడుతుంది. ఈ సాంకేతికతతో పాటు.. గోప్యత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఎందుకంటే.. భారతదేశంలో ఫేస్ ఐడి, సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీకి సంబంధించి ప్రత్యేక చట్టం లేదు. ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపే ఖాతాదారులు ఫేస్ ఐడి మరియు ఐరిష్ ఐడిని ఉపయోగించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఫేస్ ఐడీతో పాటు ఖాతాదారులు ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా అందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) నుంచి వచ్చిన లేఖను అనుసరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను కోరింది.
7/ 7
ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్‌ను ఉపయోగించలేని చోట.. ఫేస్ ఐడి మరియు ఐరిస్ స్కానింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)