#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » BUSINESS » FROM CASH CASH TRANSFER TO TRAIN TICKET BOOKING YOU CAN GET MANY MORE SERVICES AT ATM SS ATM: ఏటీఎంలో ఏఏ సేవలు లభిస్తాయో తెలుసా? ATM Services | డబ్బులు డ్రా చేయడానికే ఏటీఎంకు వెళ్లేవారే ఎక్కువ. 90 శాతం మంది ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తారు. అయితే ఏటీఎంలో ఇంకా అనేక సేవలు పొందొచ్చు. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా ఏటీఎంకు వెళ్లి బ్యాంకింగ్ సేవల్ని పొందొచ్చు. బ్యాంకులకు వెళ్లి గంటలు గంటలు క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేయడం కాకుండా ఇంకా ఏఏ సేవలు సాధ్యమో తెలుసుకోండి. News18 Telugu | May 19, 2019, 8:37 PM IST 1/ 8 1. ఫిక్స్డ్ డిపాజిట్: మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇందుకోసం మీరు బ్యాంకుకే వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఏ బ్రాంచ్‌లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ ఏటీఎంకు వెళ్తే చాలు. ఏటీఎంలోని ఆప్షన్స్‌లో మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే ఏటీఎం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేముందు ఓసారి వివరాలన్నీ తెలుసుకోవడం మంచిది. 2/ 8 2. పన్ను చెల్లింపులు: చాలా బ్యాంకులు ఏటీఎంల ద్వారా పన్నులు చెల్లించే సదుపాయం కల్పిస్తున్నాయి. అడ్వాన్స్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, రెగ్యులర్ అసెస్మెంట్ లాంటి పన్నుల్ని మీరు ఏటీఎం ద్వారా చెల్లించొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా బ్యాంక్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏటీఎంలో ట్యాక్స్ చెల్లించొచ్చు. మీకు వెంటనే CIN నెంబర్ కూడా వస్తుంది. 24 గంటల తర్వాత బ్యాంకు వెబ్సైట్ నుంచి ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3/ 8 3. క్యాష్ డిపాజిట్: మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీఎంలోనే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు. అన్ని బ్యాంకులూ క్యాష్ డిపాజిట్ మెషీన్లను ఏటీఎంలల్లో ఏర్పాటు చేస్తున్నాయి. మీరు ఒకేసారి గరిష్టంగా రూ.49,900 వరకు డిపాజిట్ చేయాలి. క్యాష్ డిపాజిట్ మెషీన్లలో రూ.2000, రూ.500, రూ.100, రూ.50 నోట్లను డిపాజిట్ చేయొచ్చు. 4/ 8 4. ఇన్స్యూరెన్స్ పాలసీ ప్రీమియం: మీరు పాలసీ ప్రీమియం చెల్లించాలా? ఏటీఎంలో చేసేయొచ్చు. అవును... ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ లాంటి సంస్థలకు చెందిన పాలసీల ప్రీమియం ఏటీఎంలో చెల్లించొచ్చు. ఇందుకోసం మీ పాలసీ నెంబర్ మీ దగ్గరుండాలి. మీ ఇన్స్యూరెన్స్ కంపెనీ పేరు సెలెక్ట్ చేసి, పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలను వెరిఫై చేయాలి. చివరగా ప్రీమియం అమౌంట్ ఎంతో టైప్ చేసి కన్ఫమ్ చేస్తే చాలు. పేమెంట్ పూర్తవుతుంది. 5/ 8 5. లోన్ దరఖాస్తు: పర్సనల్ లోన్ కావాలా? మీరు ఏటీఎంలోనే అప్లై చేయొచ్చు. ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఉంటే వెంటనే డబ్బులు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. మీ కార్డు స్వైప్ చేసిన తర్వాత మీకు లోన్ ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో లోన్‌కు దరఖాస్తు చేయొచ్చు. 6/ 8 6. క్యాష్ ట్రాన్స్ఫర్: మీకు నెట్ బ్యాంకింగ్ లేదా? అయినా మీరు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ సదుపాయం కోసం మీరు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకేసారి రూ.40,000 వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రోజులో న్నిసార్లైనా నగదు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 7/ 8 8. రైలు టికెట్ బుకింగ్: రైలు టికెట్లు కూడా ఏటీఎంలో బుక్ చేసుకోవడం సాధ్యం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవల్ని అందిస్తోంది. 8/ 8 9. మరిన్ని సేవలు: ఇవే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వైరీ, స్టేట్మెంట్, పిన్ ఛేంజ్, చెక్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, చెక్ బుక్ రిక్వెస్ట్, డొనేషన్స్ ఇలా మరిన్ని సేవలు కూడా లభిస్తాయి. తాజా వార్తలుRakul Preet Singh : నా వ్యాపారం మూత పడిన ఉద్యోగులకు జీతాలు ఆపలేదు : రకుల్ ప్రీత్..Viral Video: ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు... ఆ చిన్నారి కోసం ప్రపంచం సాయంతల్లి చనిపోయిందని తెలిసి వస్తున్న కూతుళ్లు.. మరో రెండు కిలోమీటర్లలో ఊరికి చేరుకుంటామనగా..World Record Marriages: ఒకే రోజు 3229 పెళ్లిళ్లు... ప్రపంచ రికార్డు Top Stories India Covid 19: ఇండియాలో కరోనా.. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలితాల్లో పెరిగిన యాక్టివ్ కేసులు Viral Video: ఆ ఇంజెక్షన్ ధర రూ.16 కోట్లు... ఆ చిన్నారి కోసం ప్రపంచం సాయం New Rules in March: సామాన్యులకు అలర్ట్... మార్చిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే తల్లి చనిపోయిందని తెలిసి వస్తున్న కూతుళ్లు.. మరో రెండు కిలోమీటర్లలో ఊరికి చేరుకుంటామనగా.. World Record Marriages: ఒకే రోజు 3229 పెళ్లిళ్లు... ప్రపంచ రికార్డు
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results