1. IRDAI: కొత్త బైక్ లేదా కార్ కొనేవారికి ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 1 నుంచి కొనే కార్లు, బైకులకు లాంగ్ టర్మ్ వెహికిల్ ఇన్స్యూరెన్స్ ప్యాకేజీ పాలసీలు తీసుకోవడం తప్పనిసరి కాదు. కాబట్టి కస్టమర్లకు కార్లు, బైకుల ఆన్ రోడ్ ధర తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. Minimum Balance: బ్యాంకులో ప్రతీ అకౌంట్కు మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలు ఉంటాయి. ఆగస్ట్ 1 నుంచి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ మారనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మూడు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ తర్వాత కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేయనున్నాయి. దీంతో పాటు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వసూలు చేసే ఛార్జీలను పెంచాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. RBI: సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లు మారనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయి. రూ.1 లక్షలోపు ఉంటే 4.75 శాతం, రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటే 6 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.5 కోట్లు ఉంటే 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక డెబిట్ కార్డ్ పోగొట్టుకున్నా, డ్యామేజ్ అయినా కొత్త కార్డు కోసం రూ.250 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. E-Commerce: ఆగస్ట్ 1 నుంచి ఇ-కామర్స్ కంపెనీలు ఉత్పత్తులపై ఏ దేశానికి చెందిన ప్రొడక్ట్ అన్న విషయాన్ని వివరించాల్సి ఉంటుంది. కస్టమర్లు మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్ని, ఇతర దేశాల్లో తయారైన ప్రొడక్ట్స్ని గుర్తించేందుకు వీలుగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)