1. ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ (Washing Machine) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. త్వరలో వీటి ధరలు త్వరలో తగ్గబోతున్నాయి. ఓవైపు మాంద్యం భయాల మధ్య గ్లోబల్ కమోడిటీ ధరలు తగ్గాయి. ఇన్పుట్ ఖర్చులు తగ్గడంతో ఫ్రిజ్‌లు, ఏసీలు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు త్వరలో తగ్గే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇప్పుడు ఇన్పుట్ ఖర్చులు తగ్గి, మార్జిన్లు పెరగడంతో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, వాషింగ్ మెషీన్లు తయారుచేసే కంపెనీలు అడ్వర్టైజ్మెంట్లు పెంచి, మంచి డిస్కౌంట్లు అందిస్తూ కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. సెప్టెంబర్ తర్వాత పండుగ సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ కంపెనీలకు మంచి రోజులు వచ్చినట్టే. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ లాంటి హోమ్ అప్లయెన్సెస్ ధరలు ఇప్పుడే తగ్గకపోవచ్చు. రాబోయే పండుగ సీజన్లో ధరలు తగ్గడంతో పాటు వీటిపై మంచి డిస్కౌంట్స్ కూడా చూడొచ్చు. కాబట్టి ఈ వస్తువు కొనాలనుకునేవారు కావాల్సిన మోడల్స్ సెలెక్ట్ చేసుకొని ధరలను ట్రాక్ చేస్తూ ఉండాలి. దసరా, దీపావళి సీజన్లో ఆఫర్ ధరలకే కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ప్రజలకు మరో శుభవార్త ఏంటంటే... వారం రోజుల్లో వంట నూనెల ధరలు కూడా తగ్గబోతున్నాయి. లీటర్‌పై రూ.10 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వంట నూనెల తయారీ కంపెనీలను కోరాయి. కంపెనీలు వారం రోజుల్లో ధరల్ని తగ్గించబోతున్నాయి. అంతేకాదు, ఒక బ్రాండ్‌కు చెందిన ఆయిల్ ధర దేశమంతా ఒకేలా ఉండబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)