IRCTC Bus Ticket booking: రైలు టికెట్ మాత్రమే కాదు... ఐఆర్సీటీసీలో బస్ టికెట్ కూడా బుక్ చేయొచ్చు
IRCTC Bus Ticket booking: రైలు టికెట్ మాత్రమే కాదు... ఐఆర్సీటీసీలో బస్ టికెట్ కూడా బుక్ చేయొచ్చు
IRCTC Bus Ticket booking | ఐఆర్సీటీసీ ఇటీవల బస్ టికెట్ బుకింగ్ సర్వీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐఆర్సీటీసీ కొత్తగా ప్రారంభించిన సర్వీస్ కాబట్టి ప్రయాణికుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. మరి మీకు కూడా ఈ సందేహాలు ఉన్నాయా? అయితే సమాధానాలు తెలుసుకోండి.
1. ఐఆర్సీటీసీ బస్ టికెట్ బుకింగ్‌లో ఆర్టీసీ బస్ టికెట్స్ బుక్ చేయొచ్చా? ఏపీఎస్ఆర్టీసీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన రోడ్డు రవాణా కార్పొరేషన్ నడిపే బస్సుల్లో రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 14
2. బస్సు ఎక్కేముందు టికెట్ ప్రింట్ తీసుకోవాలా? ఇ-మెయిల్, యాప్‌లో ఉన్న ఇ-టికెట్స్ చూపిస్తే సరిపోతుంది. వీలైతే ఇ-టికెట్ ప్రింట్ తీసుకొంటే మేలు. ప్రభుత్వానికి చెందిన ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 14
3. బస్సు మిస్ అయితే రీఫండ్ వస్తుందా? బస్సు మిస్ అయితే రీఫండ్ రాదు. ఒకవేళ ఆపరేటర్ బస్సు క్యాన్సిల్ చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే రీఫండ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 14
4. ఐఆర్సీటీసీలో బస్సు టికెట్లు ఎలా బుక్ చేయాలి? https://www.bus.irctc.co.in/ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రయాణ తేదీ, బస్సు వివరాలు, సీట్ సెలెక్ట్ చేసి వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ చేస్తే టికెట్ బుక్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 14
5. బస్సు నెంబర్, డ్రైవర్ వివరాలు ఎప్పుడు తెలుస్తాయి? బోర్డింగ్ పాయింట్‌కు బస్సు రావడానికి రెండు గంటల ముందు ఎస్ఎంఎస్లో వివరాలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 14
6. బస్ టికెట్ బుక్ చేయడానికి అకౌంట్ క్రియేట్ చేయాలా? ఐఆర్సీటీసీ అకౌంట్ ద్వారా బస్ టికెట్లు బుక్ చేయొచ్చు. ఐఆర్సీటీసీ అకౌంట్ లేకపోతే గెస్ట్ యూజర్ లాగిన్ ద్వారా బుక్ చేయొచ్చు. ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 14
7. బస్సు టికెట్లు క్యాన్సిల్ చేయొచ్చా? ఎప్పుడైనా బస్ టికెట్ క్యాన్సిల్ చేయొచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను ఆన్లైన్లో క్యాన్సిల్ చేయాలి. కౌంటర్లో బుక్ చేస్తే కౌంటర్లోేనే క్యాన్సిల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 14
8. పేమెంట్ ఎలా చేయొచ్చు? డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 14
9. ఒకేసారి ఎన్ని టికెట్లు బుక్ చేయొచ్చు? ఒక ట్రాన్సాక్షన్ ద్వారా 6 టికెట్లు బుక్ చేయొచ్చు. ఐదేళ్ల వయస్సు కన్నా ఎక్కువ ఉంటే ఫుల్ ఫేర్ చెల్లించాలి. గ్రూప్ టికెట్ల కోసం buscare@irctc.com మెయిల్ ఐడీలో సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 14
10. టికెట్‌పై పేరు, జెండర్ మార్చొచ్చా? ఒకసారి టికెట్ బుక్ చేసిన తర్వాత పేరు, జెండర్ మార్చడానికి వీల్లేదు. మార్పులు ఉంటే టికెట్ క్యాన్సిల్ చేసి మళ్లీ బుక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 14
11. ఏవైనా సమస్యలు ఉంటే కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? బస్ టికెట్ బుకింగ్‌పై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉంటే 1800110139 నెంబర్లో లేదా buscare@irctc.com మెయిల్ ఐడీలో సంప్రదించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 14
12. డబ్బులు డెబిట్ అయినా టికెట్ జనరేట్ కాకపోతే ఏంటీ పరిస్థితి? సేమ్ అకౌంట్‌కు 3-5 రోజుల్లో రీఫండ్ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 14
13. ఐఆర్సీటీసీ వసూలు చేసే ఛార్జీలు ఎంత? ఏసీ క్లాస్ బస్ టికెట్‌కు రూ.20+జీఎస్టీ, ఏసీ క్లాస్ బస్ టికెట్‌కు రూ.10+జీఎస్టీ చెల్లించాలి. పేమెంట్ గేట్‌వే ఛార్జీలు కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 14
14. బ్యాగేజీ పాలసీ ఏవిధంగా ఉంది? ప్రతీ ప్రయాణికుడు 10 కిలోల వరకు బ్యాగ్ క్యారీ చేయచ్చు. దీంతో పాటు ల్యాప్‌టాప్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, బ్రీఫ్ కేస్ తీసుకెళ్లొచ్చు. వెపన్స్, ఫైర్ ఆర్మ్స్, డ్రగ్స్ లాంటివి తీసుకెళ్ల కూడదు. (ప్రతీకాత్మక చిత్రం)