1. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో కంపెనీలు ఉద్యోగులకు సాలరీ బోనస్ ఇవ్వడం మామూలే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్ కాదు కదా, సాలరీ సరిగ్గా వస్తే చాలని, ఉద్యోగం పోకుండా ఉంటే మంచిదని అనేకమంది ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా లేఆఫ్స్ (LayOffs) సీజన్ కొనసాగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మెటా, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థల నుంచి చిన్న చిన్న కంపెనీల వరకు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో భయం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రెంచ్కు చెందిన లగ్జరీ బ్రాండ్ హెర్మెస్ (Hermes) తమ ఉద్యోగులకు వన్ టైమ్ ఇయర్ ఎండ్ బోనస్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 19,700 మంది ఉద్యోగులకు సాలరీ బోనస్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఒక్కొక్కరికీ 4,000 యూరోలు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.5 లక్షల్ని బోనస్‌గా ప్రకటించింది కంపెనీ. వారికి ఫిబ్రవరి చివరి నాటికి బోనస్ లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పెరగడంతో ఈ కంపెనీకి లాభాలు కూడా పెరిగాయి. దీంతో తమ ఉద్యోగులకు బోనస్ ఇచ్చి సంతోషపరుస్తోంది కంపెనీ. (ప్రతీకాత్మక చిత్రం)
5. హెర్మెస్ లగ్జరీ గూడ్స్ తయారు చేసి అమ్మే కంపెనీ. లెదర్ వస్తువులు, ఫ్యాషన్ యాక్సెసరీస్, లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ప్రత్యేకత. ఫ్రాన్స్‌లో 12,400 హెర్మెస్ ఉద్యోగులకు లాభాల్లో వాటా, ప్రోత్సాహక బోనస్‌లతో సహా 17 నెలల జీతంతో సమానంగా లభిస్తుందని సీఈఓ ఏక్సెల్ డుమాస్ అనలిస్టుల సమావేశంలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ బోనస్ చెల్లింపు వ్యాల్యూ షేరింగ్ విధానంలో భాగమని, వాటాదారులకు కూడా డివిడెండ్ పెరుగుదల ఉంటుందని కంపెనీ పేర్కొంది. 2022 లో 11.6 బిలియన్ డాలర్ల అమ్మకాలకు జరిపింది. 2021 అమ్మకాల కన్నా 23 శాతం ఎక్కువ సంపాదించింది. లూయిస్ విట్టన్, ఛానెల్ తర్వాత హెర్మెస్ మూడో అతిపెద్ద లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌గా స్థానాన్ని సంపాదించింది. (ప్రతీకాత్మక చిత్రం)