Ration from Atm: ఏటీఎం నుంచి రేషన్ సరుకులు.. దేశంలో తొలిసారి అక్కడ ఏర్పాటు.. వివరాలివే..
Ration from Atm: ఏటీఎం నుంచి రేషన్ సరుకులు.. దేశంలో తొలిసారి అక్కడ ఏర్పాటు.. వివరాలివే..
Ration from Atm: ఆహార ధాన్యాల కోసం రేషన్ దుకాణాల వద్ద ఇక నుంచి గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. హరియాణా ప్రభుత్వం దీని కోసం ఓ ప్రయత్నం చేసింది. బ్యాంకు ఏటీఎం తరహాలో రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1/ 9
దేశంలో రేషన్ పంపిణీ విధానంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. వన్ నేషన్.. వన్ రేషన్ తో కేంద్ర ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డుతో రేషన్ సరుకులను ఎక్కడైనా తీసుకోవచ్చనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
అంతే కాకుండా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటికి వెళ్లి రేషన్ ను పంపిణీ చేస్తుంది. తాజాగా ఏటీఎం ద్వారా రేషన్ తీసుకునే విధంగా హర్యానా ప్రభుత్వం ఓ ప్రయత్నం చేసింది.
3/ 9
దేశంలోనే తొలి 'రేషన్ ఏటీఎం'ను గుడ్గావ్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసినట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. 5 నుంచి 7 నిమిషాల్లో ఈ ఏటీఎం నుంచి 70 కిలోల వరకు ధాన్యం విడుదలవుతుందని వెల్లడించారు.
4/ 9
ఇక నుంచి ఆహార ధాన్యాల కోసం ఎవరూ కూడా రేషన్ దుకాణాల వద్ద గంటల కొద్ది వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. హరియాణా ప్రభుత్వం గ్రెయిన్ ఏటీఎం(రేషన్ సరకుల ఏటీఎం) ద్వారా వాటిని సరఫరా చేయనుందని స్పష్టం చేశారు.
5/ 9
ధాన్యం ఏటీఎంలతో రేషన్ షాపుల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెరపడుతుందని చౌతాలా అన్నారు. ప్రజా ఆహార పంపిణీ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు.
6/ 9
తొలి రేషన్ సరకుల ఏటీఎంను గుడ్‌గావ్‌లోని ఫరూక్‌నగర్‌లో ప్రారంభించగా, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
బ్యాంకు ఏటీఎం లానే రేషన్ సరకుల ఏటీఎం పనిచేస్తుంది. ఇందులో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. టచ్‌స్క్రీన్ ద్వారా లబ్ధిదారుడు ఆధార్ లేదా రేషన్ ఖాతా నెంబర్ పొందుపరచాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
బయోమెట్రిక్ అథెంటికేషన్ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో నింపేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
దీని ద్వారా బియ్యం, గోధుమ, చిరుధాన్యాలు సరఫరా చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)