క్లోజ్డ్ రూమ్
అడ్వాన్స్డ్ ఏసీలు ఇన్వర్టర్ కంప్రెషర్లతో వస్తాయి. ఇవి సెట్ చేసిన ఉష్ణోగ్రతను మెయింటెన్ చేయడానికి, AC సెట్టింగ్స్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తాయి. అయితే గది నుంచి చల్లని గాలి బయటకు వెళితే, AC కావలసిన ఉష్ణోగ్రతను చేరుకోవడానికి కష్టపడుతుంది. ఇలా నిరంతరాయంగా పనిచేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. చల్లని గాలి బయటకు రాకుండా అన్ని కిటికీలు, తలుపులు మూసివేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
సర్వీసింగ్
కొంతకాలం పాటు ఉపయోగించకుండా ఉంటే చాలు ACలో దుమ్ము, చెత్త పేరుకుపోతాయి. గాలి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి, సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. దీంతో ఏసీ ఎక్కువ ఎనర్జీని వినియోగిస్తుంది. అందుకే ACని క్రమం తప్పకుండా లేదా ప్రతి సీజన్ ప్రారంభంలో సర్వీస్ చేయించాలి. రెగ్యులర్ సర్వీసింగ్ ద్వారా ఏసీ సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
24 డిగ్రీ టెంపరేచర్
చాలా మంది ఏసీని తక్కువ టెంపరేచర్లో ఉంచితే, రూమ్ త్వరగా చల్లబడుతుందని భావిస్తారు. ACలో సెట్ చేసిన ఉష్ణోగ్రత కావలసిన పరిసర ఉష్ణోగ్రతను సూచిస్తుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. 24 డిగ్రీల సెల్సియస్ మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతకు ACని సెట్ చేస్తే, యూనిట్ మరింత సమర్థవంతంగా పని చేస్తుంది. లో టెంపరేచర్లో కంటే తక్కువ ఎనర్జీని ఏసీ వినియోగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
అప్పుడు ఆఫ్ చేయాల్సిందే..
ఏసీ ఉపయోగించనప్పుడు పూర్తిగా ఆఫ్ చేయాలి. చాలా మంది ACని ఆఫ్ చేయడానికి రిమోట్ కంట్రోల్‌ని ఉపయోగిస్తారు. అయితే ఇది యూనిట్‌ను స్టాండ్‌బై మోడ్‌లో ఉంచుతుంది. ఇది ఐడిల్ లోడ్ ఎలక్ట్రిసిటీని వినియోగిస్తుంది. వేస్టెడ్ ఎనర్జీని తగ్గించడానికి మెయిన్ స్విచ్ ఉపయోగించి AC స్విచ్ ఆఫ్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్ అసిస్టెంట్స్
ACకి స్మార్ట్ క్యాపబిలిటీస్ ఉంటే లేదా థర్డ్-పార్టీ Wi-Fi IR రిమోట్లకు కనెక్ట్ అవుతుంటే, అలెక్సా లేదా గూగుల్ అసిస్టెంట్ రొటీన్లను ఉపయోగించవచ్చు. నిర్దిష్ట వ్యవధిలో ACని ఆటోమేటిక్‌గా ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి రొటీన్‌ను క్రియేట్ చేయవచ్చు. AC వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)