వెబ్సైట్ కంపెనీ: ఆకర్షణీయమైన బట్టలు లేదా వస్తువు యొక్క ఫోటోను చూపిస్తూ సోషల్ మీడియాలో అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అయితే అలాంటి వెబ్ సైట్ యొక్క రిజిస్టర్ కార్యాలయం యొక్క చిరునామా, ల్యాండ్‌లైన్ నంబర్ మరియు ఇతర సమాచారాన్ని తనిఖీ చేయడం ముఖ్యం. ఏ కంపెనీ వెబ్సైట్లోనైనా వారి పూర్తి సమాచారం కనిపించకపోతే అలాంటి సైట్ నుండి షాపింగ్ చేయవద్దు.(ప్రతీకాత్మక చిత్రం)
క్యాష్ ఆన్ డెలివరీ: ఇటీవల అనేక కొత్త కొత్త కంపెనీలు వివిధ పేర్లతో ఆన్లైన్ షాపింగ్ లోకి అడుగు పెడుతున్నాయి. ఇంటర్ నెట్లో ఆకర్షనీయమైన ఆఫర్లతో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే అలాంటి వాటిని నమ్మడం అంత మంచిది కాదు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించాక.. ఆయా కంపెనీలు డెలివరీ చేయకుండా మనని మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కొత్త కొత్త సైట్లలో షాపింగ్ చేస్తే డెలివరీ అయ్యాకే డబ్బులు ఇవ్వడం మంచిది. అంటే క్యాష్ ఆన్ డెలివరి(COD) ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక వేళ వారు ఈ ఆప్షన్ ఇవ్వక పోతే అలాంటి సైట్లలో కొనుగోలు చేయకపోవడమే మేలు.(ప్రతీకాత్మక చిత్రం)