1. ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డు అనేక చోట్ల అవసరం అవుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు (Govt Schemes) పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. రేషన్ షాపులో సరుకులు తీసుకోవాలన్నా ఆధార్ నెంబర్ కావాల్సిందే. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు ఆధార్ నెంబర్కు లింక్ అయిన అకౌంట్లలో జమ అవుతుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఈ సేవల్ని అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ లో మీరు మీ ఆధార్ నెంబర్ను ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేశారో తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మీ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఈ వివరాలు తెలుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఒక వేళ మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్కు లింక్ లేనట్టైతే మీరు మీ అకౌంట్ ఉన్న బ్యాంకు వెబ్సైట్లో ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు. మీకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నట్టైతే మీరు ప్రభుత్వ పథకాలకు చెందిన డబ్బుల్ని ఏ అకౌంట్లోకి పొందాలనుకుంటే ఆ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)