1. ఎవరైనా పాన్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా సబ్మిట్ చేస్తున్నారా? ఏవైనా ఆర్థిక లావాదేవీల కోసం ఇతరుల పాన్ కార్డ్ (PAN Card) కాపీ తీసుకున్నారా? మరి ఆ పాన్ కార్డ్ ఒరిజినలేనా? లేక నకిలీ పాన్ కార్డ్ ఇచ్చారా? చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాతో స్కాన్ చేసి ఒరిజినల్ పాన్ కార్డ్, నకిలీ పాన్ కార్డును తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇందుకోసం ఆదాయపు పన్ను ఎన్ఎస్డీఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ రూపొందించిన PAN QR Code Reader యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాలి. ఈ యాప్‌తో నకిలీ పాన్ కార్డును ఈజీగా గుర్తించొచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. సెర్చ్‌లో PAN QR Code Reader అని టైప్ చేసి సెర్చ్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. చాలా రకాల క్యూఆర్ కోడ్ యాప్స్ కనిపిస్తాయి. డెవలపర్ దగ్గర NSDL e-Governance Infrastructure Limited అని ఉన్న యాప్ మాత్రమే ఇన్స్టాల్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ అయిన PAN QR Code Reader యాప్ ఓపెన్ చేయండి. కెమెరా వ్యూఫైండర్లో గ్రీన్ కలర్ ప్లస్ లాంటి గ్రాఫిక్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. PAN QR Code Reader యాప్‌తో పాన్ కార్డును స్కాన్ చేసేప్పుడు కెమెరా క్లారిటీ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. బ్లర్ కాకూడదు. ఎలాంటి గ్లేర్ లేదా ఫ్లాష్ ఉండొద్దు. అప్పుడే క్యూఆర్ కోడ్ సరిగ్గా స్కాన్ అవుతుంది. స్కానింగ్ పూర్తైన తర్వాత పాన్ కార్డ్ హోల్డర్ వివరాలు కనిపిస్తాయి. వివరాలేవీ కనిపించకపోతే అది నకిలీ పాన్ కార్డుగా భావించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ యాప్‌తో మీ పాన్ కార్డును కూడా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోవడానికి పాన్ కార్డ్ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయాలి. పాన్ కార్డ్ స్కాన్ చేసేముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 2018 జూలై 7 కన్నా ముందు జారీ చేసిన పాన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
7. పాత కార్డులు పాత డిజైన్ ప్రకారమే ఉంటాయి. 2018 జూలై 7 తర్వాత జారీ చేసిన పాన్ కార్డ్, ఇ-పాన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ లాంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. మీ పాన్ కార్డుపై క్యూఆర్ కోడ్ లేకపోతే డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. క్యూఆర్ కోడ్‌లో పాన్ కార్డ్ హోల్డర్ ఫోటో, పేరు, సంతకం, పుట్టిన తేదీ లాంటి వివరాలన్నీ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)