ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ లవర్లకు శుభవార్త చెప్పింది. స్మార్ట్ ఫోన్ కార్నివాల్ 2021 పేరిట ప్రత్యేక సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ ఈ అర్థరాత్రి 12 గంటలకు ప్రరంభమైంది. ఈ సేల్ లో ప్రముఖ బ్రండ్ల సెల్ ఫోన్లపై భారీ తగ్గింపు అందించారు. యాపిల్, మోటరోలా, పోకో, సాంసంగ్, రియల్మీ, షియోమి, మరియు ఇతర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్లపై కార్నివాల్ 2021 సందర్భంగా భారీ తగ్గింపు ధరలకే పొందొచ్చు. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ కార్డుదారులు అనేక ఫోన్లపై రూ .2,250 వరకు అదనపు తగ్గింపులను పొందవచ్చు. ఈ సేల్ మార్చి 12 వరకు కొనసాగనుంది.