Flipkart Big Saving Days 2021: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈరోజు ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగనుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ లో స్మార్ట్ ఫోన్లు మరియు స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపులను ఇచ్చింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో పెద్ద సైజు స్మార్ట్ టీవీలు చౌకగా లభిస్తున్నాయి. అదేవిధంగా, 40-అంగుళాల హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీలను ఆకర్షణీయమైన ధరలకు మరియు బ్యాంక్ ఆఫర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ద్వారా Mi 4A హారిజన్ ఎడిషన్ 40-అంగుళాల ఆండ్రాయిడ్ టీవీని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మీకు 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంటే మీకు రూ.1500 తగ్గింపు లభిస్తుంది. ఇలా కొనుగోలు చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.21,499 కే కొనేయొచ్చు.
ఎక్స్ చేంజ్ ఆఫర్: ఈ ఆండ్రాయిడ్ టీవీపై రూ.11,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. మీరు పాత టీవీతో ఎక్సేంజ్ చేస్తే.. మీరు మరింత తగ్గింపు పొందవచ్చు. మీరు ఎక్సేంజ్ చేసే టీవీ కండిషన్ బాగుంటే, మోడల్ అప్డేట్గా ఉంటేపూర్తి స్థాయి తగ్గింపు పొందొచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ పూర్తిగా పొందితే మీరు కేవలం 10,499కే ఈ Android TVని సొంతం చేసుకోవచ్చు.