1. ఉర్జీత్ పటేల్: ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా కేంద్ర ప్రభుత్వానికే కాదు... మార్కెట్ వర్గాలకూ ఊహించని షాక్. ఆయన రాజీనామాకు ముందు చాలా పరిణామాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐకి మధ్య విభేదాలు, ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. పలుమార్లు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకున్నా ఆర్బీఐతో విభేదాలు సద్దుమణగలేదు. చివరకు డిసెంబర్ 10న ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా చేశారు. అయితే ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు తెలిపారు.
2. బిన్నీ బన్సాల్: కార్పొరేట్ వర్గాలకు షాకిచ్చిన మరో నిష్క్రమణం ఫ్లిప్కార్ట్ సీఈఓ బిన్నీ బన్సాల్ది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడైన బిన్నీ బన్సాల్ ఆకస్మికంగా పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంతకుముందు బన్సాల్పై ఫ్లిప్కార్ట్ మాజీ మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేయడం, ఈ వ్యవహారంలో వాల్మార్ట్ గ్లోబల్ విచారణ జరపడం, పరస్పర అంగీకారంతో ఎఫైర్ కొనసాగినట్టు తేలినా "తీవ్రమైన వ్యక్తిగత అనుచిత ప్రవర్తన" కారణంగా నవంబర్లో ఆయన నిష్క్రమించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
4. చందా కొచ్చర్: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓగా పనిచేసిన చందా కొచ్చర్ అక్టోబర్ 4న తన పదవులకు రాజీనామా చేశారు. చందాకొచ్చర్ రుణ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసే విషయంలో ఆమె సహకరించిందన్న ఆరోపణలొచ్చాయి. ఇందుకు బదులుగా వీడియోకాన్ సంస్థ నుంచి ఆమె భర్తకు లబ్ధి చేకూరిందన్నది ఆ ఆరోపణల సారాంశం. ఈ వివాదంతో చందాకొచ్చర్ బ్యాంకు పదవులకు రాజీనామా చేశారు.
6. శిఖా శర్మ: యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు త్రైమాసికంలో భారీ నష్టాలు రావడం, నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో చట్టవిరుద్ధంగా పాత నోట్లను మార్చినట్టు ఆరోపణలు రావడం లాంటి పరిణామాలతో శిఖా శర్మ వైదొలిగారు. ఆమె మరో మూడేళ్లు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరినా ఆర్బీఐ అంగీకరించలేదు.