- సాధారణంగా ఎఫ్‌డీల మెచ్యూరిటీ ఎక్కువైతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిపై వడ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కోలా ఉండవచ్చు. ప్రస్తుతం FD వడ్డీ రేట్లు 6.5% నుంచి 8% మధ్య ఉంటాయి. కొన్ని బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అలాగే కొన్ని చిన్న, ప్రైవేట్ బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించడానికి ఎఫ్డీలపై పెద్ద మొత్తంలో వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి.
- FDలు రిస్క్-ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్. తక్కువ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లకు (low-risk appetite) ఇవి మంచి ఆప్షన్‌గా మారాయి. వీటిపై వడ్డీ రేట్లను బ్యాంకులు ముందుగానే నిర్ణయిస్తాయి. అంటే వీటిలో చేసే డిపాజిట్లపై ఎలాంటి రిస్క్ లేకుండా, స్థిరమైన రాబడి అందుతుంది. వడ్డీ రేట్లు కూడా హెచ్చుతగ్గులకు గురికావు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించే రెపో రేటు ఆధారంగా మాత్రమే బ్యాంకులు, NBFCలు FD వడ్డీ రేట్లను మారుస్తాయి.
* విత్‌డ్రా ఆప్షన్ : ఫిక్స్డ్ డిపాజిట్లలో నిర్ణీత కాలానికి పెట్టుబడి పెట్టాలి. కాబట్టి మెచ్యూరిటీ తర్వాత వీటిపై మంచి రాబడి పొందవచ్చు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఎఫ్డీ అమౌంట్ గడువుకు ముందే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, ఇందుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఆర్థిక అత్యవసర పరిస్థితిలో తప్ప, FD నిధులను గడువుకు ముందు విత్‌డ్రా చేసే ఆలోచనను పూర్తిగా పక్కన పెట్టాలి.
* బ్యాంకులకు కీలకం : ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు, ఆ రుణదాత డిపాజిటర్ల నిధులను ఇతర కస్టమర్లు లేదా కంపెనీలకు క్రెడిట్ సోర్స్‌గా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు బదులుగా బ్యాంకు ఆ ఖాతాదారునికి వడ్డీని అందిస్తుంది. అయితే ఈ నిధులను ఖాతాదారులు ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కు తీసుకుంటే, బ్యాంకింగ్ వ్యవస్థ బ్యాలెన్స్ తప్పుతుంది. అందుకే ముందుగా నిర్ణయించిన గడువు ప్రకారం పెట్టుబడిదారులు తమ నిధులను డిపాజిట్ చేయడానికి అంగీకరిస్తే, బ్యాంకు ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లలో ఫండ్స్ విత్‌డ్రాపై పరిమితులు ఉండటం వల్ల బ్యాంకులను నిధుల లభ్యత పెరుగుతుంది. అందుకే సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లతో పోలిస్తే ఇలాంటి టర్మ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందుతుంది.