ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంక్‌లో బంగారంపై లోన్‌పై వడ్డీ రేటు 7.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ప్రాసెసింగ్ ఫీజు 1 శాతంగా ఉంటుంది. బంగారం విలువలో 75 శాతం వరకు మొత్తాన్ని రుణం రూపంలో పొందొచ్చు. కాగా గోల్డ్ లోన్ పొందాలని భావించే వారు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పొలం పట్టా (అగ్రికల్చర్ గోల్డ్ లోన్ పొందాలని భావించే వారు), బ్యాంక్ పాస్ బుక్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బంగారు ఆభరణాలను వెంట తీసుకెళ్లండి.