1. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో (EPS) ఉన్నవారికి ప్రస్తుతం రూ.1,000 కనీస పెన్షన్ లభిస్తోంది. కనీస పెన్షన్ (Minimum Pension) పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈపీఎఫ్ మినిమమ్ పెన్షన్ రూ.3,000 లేదా రూ.6,000 చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఎంత పెంచుతారన్నదానిపై స్పష్టత లేదు కానీ, కనీస పెన్షన్ పెంచడానికి ఈపీఎఫ్ఓ కసరత్తు మాత్రం చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంచాలన్న కేంద్ర కార్మిక శాఖ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. బీజేడీ ఎంపీ భర్తృహరి మహ్తాబ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఆర్థిక శాఖ నుంచి దీనిపై వివరణ కోరింది. అయితే కార్మిక శాఖ పెన్షన్ ఎంత పెంచాలని ప్రతిపాదించిన విషయం తెలియదు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కనీస ప్రతిపాదనను తిరస్కరించడం గురించి చైర్మన్ భర్తృహరి మహతాబ్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ అధికారులు వివరించారు. ఇది కాకుండా, ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ ఆపరేషన్, దాని కార్పస్ ఫండ్ నిర్వహణపై అధికారులు ఛైర్మన్‌కి వివరించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులను పిలిపించి తిరస్కరణకు గల కారణాలను తెలుసుకోనుంది పార్లమెంటరీ ప్యానెల్. (ప్రతీకాత్మక చిత్రం)
4. అంతకుముందు, కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS), 1995 సమీక్ష కోసం ఒక ఉన్నత-పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈపీఎఫ్ మెంబర్, వితంతు పెన్షన్ కమిటీ నివేదిక ద్వారా సిఫార్సు చేసింది. అలాగే పెన్షన్‌ను నెలకు రూ.2000 ఇవ్వాలని కూడా సూచించింది. రూ.1,000 కనీస పెన్షన్ సరిపోదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. సంఘటిత రంగంలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ అందించేందుకు 1995 లో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ప్రారంభమైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉన్నవారికి ఈపీఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈపీఎఫ్ సభ్యులకు 58 ఏళ్లు దాటిన తర్వాత ప్రతీ నెలా పెన్షన్ లభిస్తుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత ఎర్లీ పెన్షన్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే 10 ఏళ్ల సర్వీస్ ఉన్న ఈపీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే ఈపీఎస్ పెన్షన్ వర్తిస్తుంది. బేసిక్ వేతనంలో ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. యజమాని వాటా నుంచి 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్లో జమ కావాలి. ఇక 10 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)