Nirmala Sitaraman: చౌకగా పెట్రోల్, డీజిల్.. ప్రధాని మోదీ నిర్ణయం వల్లేనన్న ఆర్థికమంత్రి
Nirmala Sitaraman: చౌకగా పెట్రోల్, డీజిల్.. ప్రధాని మోదీ నిర్ణయం వల్లేనన్న ఆర్థికమంత్రి
PM Modi: ఎకనామిక్ థింక్-ట్యాంక్ ICRIER నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. ద్రవ్యోల్బణ నిర్వహణను ద్రవ్య విధానానికి మాత్రమే వదిలివేయలేమని అన్నారు. అలా చేయడం అనే విధానం వల్ల సరైన ఫలితాలు రాలేదని చాలా దేశాల్లో నిరూపితమైందని అన్నారు.
ప్రధాని మోదీ సాహసోపేతమైన చర్యలను తీసుకుని ప్రజలకు మేలు చేకూర్చుతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్‌పై రాయితీలు పొందేందుకు ప్రధానమంత్రి చాలా ముఖ్యమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు.
2/ 8
గణాంకాలను తెలియజేస్తూ ఇంతకుముందు రష్యా నుంచి కేవలం 2 శాతం ముడిచమురు మాత్రమే దిగుమతి చేసుకునేవారని, ఇది గత కొన్ని నెలల్లో 12-13 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ వివరించారు.
3/ 8
రష్యా నుంచి ముడిచమురు, గ్యాస్‌ను పొందేందుకు ఇతర దేశాలు తమ సొంత పద్ధతులను రూపొందించేందుకు ప్రయత్నించాయని చెప్పారు.
4/ 8
అన్ని దేశాలతో మన సత్సంబంధాలను కొనసాగించడంలో ప్రధానమంత్రి రాజకీయ చతురత ఉందని.. ఈ కారణంగానే రష్యా నుండి నేటికీ ఇంధనాన్ని పొందుతుమన్నామని అన్నారు.
5/ 8
ద్రవ్యోల్బణం నియంత్రణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఆర్థిక విధానం, ఇతర అంశాలతో మెరుగ్గా సమన్వయం చేసుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం అన్నారు.
6/ 8
ఎకనామిక్ థింక్-ట్యాంక్ ICRIER నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి.. ద్రవ్యోల్బణ నిర్వహణను ద్రవ్య విధానానికి మాత్రమే వదిలివేయలేమని అన్నారు. అలా చేయడం అనే విధానం వల్ల సరైన ఫలితాలు రాలేదని చాలా దేశాల్లో నిరూపితమైందని అన్నారు.
7/ 8

8/ 8
తానేమీ రిజర్వు బ్యాంకుకు చెప్పడం లేదని.. ఎలాంటి సూచనలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. అయితే ద్రవ్య విధానంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థను నిర్వహించడానికి ఆర్థిక విధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడ్డారు.