Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పండుగ సందర్భంగా పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పండుగ సందర్భంగా పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే
వినాయకచవితి నేపథ్యంలో భక్తుల రద్దీ అధికం అవడంతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) వివిధ ప్రముఖ ప్రాంతాల మధ్య 6 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07233: సికింద్రాబాద్-యశ్వంత్ పూర్ మధ్య సెప్టెంబర్ 2న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 20.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
Train No.07234: యశ్వంత్ పూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను 3వ తేదీన ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
Train No.07633: హెచ్.ఎస్.నాందేడ్-తిరుపతి ట్రైన్ ను వచ్చే నెల 3వ తేదీన ప్రకటించారు. ఈ ట్రైన్ 12.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
Train No.07634: తిరుపతి-హెచ్.ఎస్.నాందేడ్ ట్రైన్ ను సెప్టెంబర్ 4న ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 21.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 17.20 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఈ రెండు ట్రైన్లు పూర్ణ, గంగఖేర్, ఉద్గిరి, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూరు, చిట్టాపూర్, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
Train No.07151: హైదరాబాద్-యశ్వంత్ పూర్ మధ్య ఈ నెల 31 అంటే ఈ రోజు స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 21.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 10.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
Train No.07152: యశ్వంత్ పూర్-హైదరాబాద్ మధ్య సెప్టెంబర్ 1న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 05.00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ ట్రైన్ బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, యాద్గిరి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)