Multibagger Stocks | రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి రెండు స్టాక్స్. కేవలం రెండు వారాల్లోనే డబ్బులను రెట్టింపు చేసేశాయి. దీంతో ఈ షేర్లు ఉన్న వారి పంట పండింది.
Penny Stocks | కాసుల వర్షం కురుస్తోంది. స్టాక్ మార్కెట్లో రెండు షేర్లు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నాయి. లాభాల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్నాయి. ఎస్బీఈసీ షుగర్ స్టాక్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ అనే షేర్లు ఇందులో ఉన్నాయి.
2/ 8
ఈ రెండు స్టాక్స్ కేవలం రెండు వారాల వ్యవధిలోనే భారీ లాభాలు అందిస్తాయి. డబ్బులను రెట్టింపు చేసేశాయి. అంటే ఈ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు. ఈ రెండు స్టాక్స్ ఎలాంటి రాబడిని అందించాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
3/ 8
ఎస్బీఈసీ స్టాక్ గత 15 ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 200 శాతానికి పైగా పెరిగింది. షేరు ధర డిసెంబర్ 20న 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. రూ. 74.2కు చేరింది. ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ కొడుతూ వస్తోంది.
4/ 8
బీఎస్ఈలో నవంబర్ 30న ఈ షేరు ధర రూ. 23.8 వద్ద ఉంది. ఇప్పుడు రూ. 74కు చేరింది. అంటే కేవలం 15 ట్రేడింగ్ సెషన్లలోనే షేరు ధర 211 శాతం పెరిగింది. అంటే మీరు నవంబర్ 30న ఈ షేరులో రూ. లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు రూ. 3.11 లక్షలు అయ్యి ఉండేది.
5/ 8
ఈ షేరు ధర ఇంతాల పరిగిపోవడంతో స్టాక్ ఎక్స్చేంజీ కూడా ఇంతకీ ఏం జరుగుతోందో చెప్పాలని కంపెనీని కోరింది. అయతే కంపెనీ మాత్రం షేరు ధర ఎందుకు పెరుగుతోందో తెలియదని సమాధానం తెలిపింది. కంపెనీ గత ఏడాదిలో కంపెనీ డేటా సర్వర్‌పై సైబర్ ఎటాక్ జరిగిందని వెల్లడించింది.
6/ 8
అలాగే ప్రభుత్వ రంగ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ కంపెనీ షేరు కూడా రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. గత ఐదు రోజుల్లో ఈ షేరు ధర 59 శాతం పెరిగింది. అలాగే గత నెల రోజుల్లో చూస్తే.. ఈ షేరు ఏకంగా 130 శాతం పరుగులు పెట్టింది.
7/ 8
ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 316గా ఉంది. అలాగే ఈ స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి రూ. 82. షేరు ధర గత 15 ట్రేడింగ్ సెషన్లలో 105 శాతం పెరిగింది. అంటే ఇన్వెస్టర్ల డబ్బు రెట్టింపు అయ్యిందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 1న షేరు ధర రూ. 144గా ఉంది. ఇప్పుడు రూ. 295కు చేరింది.
8/ 8
గత నెల రోజుల్లో షేరు ధర 80 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే స్టాక్ ధర 188 శాతం మేర ర్యాలీ చేసింది. ఇది ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్, జిప్సమ్, బయో ఫెర్టిలైజర్స్, కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వంటివి తయారు చేస్తుంది.