సీనియర్ సిటిజన్లు(Senior Citizens) తమ పొదుపులో కొంత భాగాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే మంచిది. ఇది లిక్విడిటీని అందిస్తుంది, వడ్డీ ద్వారా ఆదాయం అందుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత రెండేళ్లుగా కీలకమైన రెపో రేటును మార్చకుండా 4 శాతం వద్దనే యథాతథంగా ఉంచింది. కొన్ని ప్రముఖు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. బ్యాంక్‌బజార్ ససమాచారం మేరకు.. సీనియర్ సిటిజన్లు మూడేళ్ల కాలానికి చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందించే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, కొత్త ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై ఉత్తమ వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఇవే.. (ప్రతీకాత్మక చిత్రం)
* సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేటును అందిస్తోంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మొత్తం మూడు సంవత్సరాలలో .1.25 లక్షలకు పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు సీనియర్ సిటిజన్‌కు మూడు సంవత్సరాల కాలానికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని అఅందిస్తున్నాయి. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష మూడేళ్లలో రూ.1.23 లక్షలకు పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)