SBI వడ్డీ రేట్లు: రూ.2కోట్ల వరకు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరిస్తున్నట్లు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 8న ప్రకటించింది. దీంతో సవరణల తరువాత 7 నుంచి 45 రోజుల వరకు గడువు ఉండే ఎఫ్డీలపై 2.9శాతం వడ్డీరేటును బ్యాంకు విధిస్తోంది. 46-179 రోజుల గడువు ఉండే డిపాజిట్లపై 3.9 శాతం, 180 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు చేసే ఎఫ్డీలపై 4.4 శాతం, 2 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే డిపాజిట్లపై 5 శాతం వడ్డీరేట్లు ఉన్నాయి. 2 నుంచి 3 సంవత్సరాల వరకు మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 5.1 శాతం, 3 నుంచి 5 సంవత్సరాల మెచూరిటీ ఉంటే డిపాజిట్లపై 5.3 శాతం, 5 నుంచి 10 సంవత్సరాల మెచూరిటీ ఉండే ఎఫ్డీలపై 5.4 శాతం వడ్డీని కస్టమర్లు పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బిపిఎస్ వడ్డీ రేటును అందిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాలు మెచూరిటీ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.4 నుంచి 6.2 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)