డబ్బు పొదుపు చేయాలంటే ఎక్కువ కాలం ప్రజలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారు. ఎలాంటి రిస్కు లేకుండా సమయానికి వడ్డీ అందే, నష్టభయం లేని మార్గాన్ని ఎంచుకొనేవారు. ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు ఉన్ని ఉన్నా ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకొనేవారు. అయితే కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు, మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ భాగా పెరిగాయి. ఇప్పుడు రిస్క్ ఎందుకని భావించేవారు ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ఒక మార్గంగా చూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
స్టాక్మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో మార్కెట్ పరిస్థితి ఆధారంగా లాభాలు వస్తాయి. అదే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములో అయితే అలా ఉండదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిక్స్డ్ ఇన్కమ్ లభిస్తుంది. కష్టపడి సంపాదించిన మొత్తానికి ఎలాంటి నష్టభయం, ఆపద లేకుండా సమయానికి ముందుగా నిర్ధారించిన వడ్డీ కలిపి భవిష్యత్తులో నగదు అందజేస్తుంది కాబట్టే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీములను ఇంకా ఆదరిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్లపై చాలా తక్కువగా వడ్డీ లభిస్తోంది. ఈ సమయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను నమ్ముకోవడం, ఎక్కువ డబ్బును అందులో పెట్టడం సరైన ఆలోచన అనిపించుకోదు. ఎక్కువ కాలానికి ఏదైనా బ్యాంకులో ఫిక్స్ట్ డిపాజిట్ చేస్తుంటే లాభ, నష్టాలు లెక్కించుకోవడం అవసరం. ఏ బ్యాంకులో ఎంత కాలానికి ఎంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుందో చూసుకోవాలి. ఐదేళ్ల వరకు దాదాపు రూ.కోటి వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తాన్ని అందించే మొదటి ఐదు బ్యాంకులు ఇవే.. (ప్రతీకాత్మక చిత్రం)
YES Bank
ప్రస్తుతం మార్కెట్లో యెస్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ అందిస్తోంది. రూ.కోటి వరకు ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 4.75 నుంచి 5 శాతం వడ్డీ దక్కుతుంది. ఈ కాలానికి కూడా ఇతర బ్యాంకులతో పోలిస్తే యెస్ బ్యాంకే ఎక్కువ వడ్డీ అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)