రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లు (Interest Rates) పొందడానికి చాలా మంది తమ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లు (Fixed Deposits) చేస్తుంటారు. మీరు కూడా వారిలో ఒకరు అయితే, ఎఫ్డీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రవేశపెట్టిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇటీవల, ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు రెండూ ఎఫ్డీలపై వడ్డీ రేటును పెంచాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఎఫ్డీకి సంబంధించిన కొన్ని రూల్స్ (Rules) మార్చింది. మీరు ఎఫ్డీ రూపంలో ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త రూల్ తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు. ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
* ఎఫ్డీకి సంబంధించి ఆర్బీఐ కొత్త రూల్స్ ఏంటి?
ఎఫ్డీ రూల్స్‌లో ఆర్బీఐ చేసిన ఇటీవలి మార్పుల ప్రకారం, మీరు మెచూరిటీ తేదీ తర్వాత మీ మొత్తాన్ని క్లెయిమ్ చేయకుంటే, మీరు దానిపై తక్కువ వడ్డీని పొందుతారు. ఈ సందర్భంలో, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకారం వడ్డీని పొందరు కానీ సేవింగ్స్ అకౌంట్ ప్రకారం మాత్రమే వడ్డీ పొందుతారు.
ప్రస్తుతం, బ్యాంకులు 5 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఎఫ్డీలపై 5% కంటే ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్స్ పై మాత్రం కేవలం 3 శాతం నుంచి 4 శాతం వరకే వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. ఈ లెక్కన మీరు ఎఫ్డీ అమౌంట్ క్లెయిమ్ చేయనందున ఎంత నష్టపోవాల్సి వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కొత్త ఎఫ్డీ రూల్స్ అన్ని కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, స్థానిక ప్రాంతీయ బ్యాంకుల్లో డిపాజిట్లకు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా బ్యాంకుల్లో 5 నుంచి 10 ఏళ్ల వరకు ఎఫ్డీలు చేస్తుంటారు ప్రజలు. అలా ఐదు శాతం కంటే ఎక్కువ వడ్డీ దక్కించుకుంటారు. కానీ ఏదో ఒక కారణం వల్ల ఎఫ్డీ మెచూర్ అయిన తర్వాత కూడా తమ మొత్తాన్ని కొందరు క్లెయిమ్ చేయలేరు. ఇలాంటి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ పై బ్యాంక్స్ వడ్డీని సేవింగ్స్ అకౌంట్ లేదా మెచూర్డ్ ఎఫ్డీ రేట్స్ లో ఏది తక్కువగా ఉంటే దాని ప్రకారం చెల్లిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)