ఈ నెల 19న ఫాదర్స్ డేను ఘనంగా జరుపుకోవడానికి అంతా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఫాదర్స్ కు బంపరాఫర్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 4
ఈ నెల 19న తండ్రులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించిది. 0-5 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఫాదర్స్ డే అంటే ఈ నెల 19న ఐదేళ్లలోపు పిల్లలతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే తండ్రులకు టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించింది తెలంగాణ ఆర్టీసీ.
3/ 4
ఈ వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ ను ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అన్ని బస్సుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆయన.
4/ 4
ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అనేక సంచలన ఆఫర్లను ప్రవేశ పెడుతున్నారు. మదర్స్ డే, సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా సైతం ఇలాంటి ఫ్రీ జర్నీ ఆఫర్లను ప్రకటించారు సజ్జనార్.