FARMERS WILL GET 4000 RUPEES IF THEY REGISTER IN PM KISAN SCHEME BY OCTOBER 31 HERE FULL DETAILS NS
PM Kisan: రైతులకు అలర్ట్.. ఇలా చేస్తే ఖాతాలోకి రూ. 4 వేలు.. రిజిస్ట్రేషన్ కు మరి కొన్ని రోజులే ఛాన్స్
రైతులు 31 అక్టోబర్ 2021 వరకు PM కిసాన్ (PM KISAN) పథకం కింద నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరు అక్టోబర్ 31 లోపు మీ రిజిస్ట్రేషన్ (PM KISAN Registration) చేసినట్లయితే, మీరు రూ. 4,000 పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ. 6 వేలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని రూ. 12 వేలకు పెంచనుందని వార్తలు వస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
దీపావళి నాటికి ఈ శుభవార్త రైతులకు అందనుందని తెలుస్తోంది. ఇదే జరిగితే రైతులకు ప్రతీ వాయిదాలో రూ. 4 వేల చొప్పున అందనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
ఇదిలా ఉంటే.. మీకు PM కిసాన్ గత విడత డబ్బులు అందకపోతే తదుపరి విడతలో మీరు మునుపటి మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
గత వాయిదా కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకోసం PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకావాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
మీ దరఖాస్తు ఆమోదించబడితే, మీకు నవంబర్‌లో రూ .2 వేలు మరియు డిసెంబర్లో రూ. 2 వేలు లభిస్తాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 10 వ విడత డబ్బులు 15 డిసెంబర్ 2021 నాటికి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
పీఎం కిసాన్ పథకం కింద మీరు ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఈ స్టెప్స్ ఫాలో కండి..(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
Step 1: మొదటగా అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
Step 2: న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ (New Farmer Registration) ఆప్షన్ పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
Step 3: మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోండి.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
Step 4: క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
Step 5: పొలం, బ్యాంక్ ఖాతాకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించి మీ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)