దేశంలో నేటికీ చాలా మంది రైతులు సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాలను చవిచూస్తున్నారు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో రైతన్న ఇంకా నష్టాల్లో కూరుకుపోతున్నాడు. అలాంటి రైతులు ఇక్కడ చెప్పే సాగు ద్వారా లక్షలు సంపాదించవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం ద్వారా లక్షల్లో ఆదాయం రాబట్టవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
డ్రాగన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు.. డ్రాగన్ ఫ్రూట్‌ను జామ్, ఐస్ క్రీం, జెల్లీ ఉత్పత్తి, పండ్ల రసం, వైన్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. అలాగే, దీనిని ఫేస్ ప్యాక్‌లలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని వైద్యులు కూడా చెబుతుంటారు. ఈ పండ్లను తినడం ద్వారా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)