వరి, మొక్కజొన్న, టమాటా, మామిడి.. ఇవన్నీ మనకు తెలిసిన పంటలే. రైతులంతా వేసేవే. ఇలాంటి పంటలే వేస్తే.. రొటీన్ వ్యవసాయం అయిపోతుంది. లాభాలు పెద్దగా రావు. అందుకే కొంతమంది రైతులు.. కొత్త పంటలు వేసి విజయం సాధిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్, ఆవకాడో వంటివి ఇలాంటివే. ఆవకాడో సాగుకు.. వేడి, తేమ వాతావరణం బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం సెట్ అవుతుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, సిక్కింలో ఈ పంటను సాగు చేస్తున్నారు.
ఇండియాలో ఇప్పుడు ఆవకాడో పండ్ల వాడకం బాగా పెరిగింది. ఇదివరకు వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు ఇండియాలోనే కావాల్సినంత ఉత్పత్తి అవుతున్నాయి. ఈ పండు ఒక్కోటీ మార్కెట్లో రూ.30 నుంచి రూ.40 దాకా ఉంటోంది. రైతులు కేజీ రూ.100 చొప్పున అమ్ముతున్నారు. కేజీకి 5 లేదా 6 పండ్లు వస్తాయి. అందువల్ల రైతుకు ఒక్కో పండుకూ రూ.20 దాకా వస్తున్నాయి. అందుకే ఈ సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆవకాడో చెట్లు కూడా మామిడి చెట్లలాగా పెరుగుతాయి. ఒక్కో ఆవకాడో చెట్టు నుంచి సీజన్‌కి 100 నుంచి 500 పండ్లు కాస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో పండ్లు చేతికొస్తాయి. మొక్కలు నాటిన ఐదు లేదా ఆరేళ్ల నుంచి ఆవకాడో కాయలు కాయడం మొదలవుతుంది. బాగా పెరిగిన పండ్లను కోసిన తర్వాత ఆరు నుంచి 10 రోజుల్లో పండుతాయి. కాబట్టి.. వాటిని 10 రోజుల్లో రైతులు అమ్ముకోవాల్సి ఉంటుంది.
కర్ణాటక నుంచి మొక్కలు తెచ్చాడు. ఒక్కో మొక్కనూ రూ.180కి కొన్నాడు. ఎకరాకి 50 మొక్కలు నాటాడు అలా 3 ఎకరాల్లో 15 మొక్కలు నాటాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరు పోశాడు." width="1920" height="1310" /> ఆవకాడో అనేది వాణిజ్య పంట. అంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. గంగాధర్.. ఎలా సాగు చెయ్యాలో టెక్నిక్స్ నేర్చుకున్నారు. కర్ణాటక నుంచి మొక్కలు తెచ్చాడు. ఒక్కో మొక్కనూ రూ.180కి కొన్నాడు. ఎకరాకి 50 మొక్కలు నాటాడు అలా 3 ఎకరాల్లో 15 మొక్కలు నాటాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీరు పోశాడు.
ఆవకాడో సాగు మధ్యలో అంతర పంటలుగా పైనాపిల్స్, అల్లం, పసుపు మొక్కలు కూడా పండించాడు. ఆవకాడో కోసం అదనంగా ఎరువులు కొనలేదు. కంపోస్ట్, వర్మీకంపోస్ట్ వంటివే వాడాడు. ఎకరాకి రూ.3 లక్షల చొప్పున మొత్తం 3 ఎకరాలకూ కలిపి ఆయన రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఒక్కో చెట్టుకీ రూ.200 కేజీల వరకూ ఆవకాడోలు కాశాయి. వాటిని కేజీ రూ.110 చొప్పున సూపర్ మార్కెట్లలో అమ్మాడు. తద్వారా రూ.33 లక్షలు పొందాడు. అందులో పెట్టుబడి 9 లక్షలు తీసేస్తే.. రూ.24 లక్షలు లాభం వచ్చింది. ఇది కాకుండా అంతర పంటల ద్వారా కూడా లాభాలు పొందాడు.