FACEBOOK WILL START CHARGING FOR WHATSAPP BUSINESS SERVICES BA
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్, ఇకపై వారి నుంచి చార్జీలు వసూలు
WhatsApp: వాట్సాప్ బిజినెస్ మీద వచ్చే ఆదాయాన్ని వినియోగించుకుని మరిన్ని ఇతర ఉచితసేవలు అందిస్తామని చెప్పింది. ప్రస్తుతం 2 బిలియన్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు.
వాట్సప్ బిజినెస్ వినియోగదారులకు గమనిక. మీరు వాట్సాప్ బిజినెస్ వినియోగిస్తున్నారా? ఇన్నాళ్లూ ఫ్రీగా వినియోగించుకున్నారు. ఇకపై చార్జీలు వసూలు చేస్తారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ప్రకటించింది.
2/ 6
వాట్సాప్ బిజినెస్ అనేది చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాట్ ఫాం ద్వారా వ్యాపారులు తమ కస్టమర్లతో నేరుగా చాటింగ్ చేస్తూ అక్కడికక్కడే క్రయవిక్రయాలు జరపవచ్చు.
3/ 6
వాట్సప్ బిజినెస్ ప్రారంభమైన నాటి నుంచి అది ఉచితంగానే అందిస్తూ వచ్చింది దాని యాజమాన్య సంస్థ ఫేస్ బుక్. ఇకపై వాట్సప్ బిజినెస్ వినియోగదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తామని ప్రకటించింది.
4/ 6
2014లో వాట్సాప్‌ను 16 బిలియన్ అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసింది ఫేస్ బుక్. అయితే, వాట్సాప్ మీద ఫేస్ బుక్కు పెద్దగా ఆదాయం లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం మీదే ఆధారపడింది.
5/ 6
వాట్సాప్ బిజినెస్ అకౌంట్ హోల్డర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తామని చెప్పిన ఫేస్ బుక్, ఆ చార్జీలు ఏ రేంజ్లో ఉంటాయనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. అది ఏ విధంగా వ్యాపారవర్గాలను ఆకట్టుకుంటుందనేది చెప్పలేదు.
6/ 6
వాట్సాప్ బిజినెస్ మీద వచ్చే ఆదాయాన్ని వినియోగించుకుని మరిన్ని ఇతర ఉచితసేవలు అందిస్తామని చెప్పింది. ప్రస్తుతం 2 బిలియన్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు.