ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మరో పథకం FAME (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ర్టానిక్ వెహికల్స్) తాలూకా గడువు 2024 మార్చితో ముగియనుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి పొడిగింపు లేదా ప్రోత్సాహకాలు ఉంటాయని సంబంధిత పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే దీనిపై మంత్రి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వారికి నిరాశే ఎదురైంది.
* కొంతమంది వ్యాపారవేత్తల అభిప్రాయం ఏంటంటే? : 2023 బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని ఇండియాలో అతిపెద్ద లియాన్ బ్యాటరీ తయారీ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సామ్రాట్ కొచర్ ప్రశంసించారు. లియాన్ సెల్స్ తో పాటు లియాన్ బ్యాటరీలు తయారు చేసే సామగ్రిపై కస్టమ్స్ డ్యూటీకి మినహాయింపు ఇవ్వడంతో తయారీ సంస్థలపై భారం తగ్గుతుందన్నారు.
ఎంఎస్ఎంఈ (MSME) కంపెనీలకు పిఎల్ఐ (PLI) పథకం తీసుకురావడంతో పాటు, జీఎస్టీ (GST) మినహాయింపు ఇస్తే బాగుంటుందన్నారు. దీని వల్ల మార్కెట్లో సరసమైన ధరకే విద్యుత్తు వాహనాలు లభిస్తాయన్నారు. పర్యావరణాన్ని ప్రోత్సహించేలా మంత్రి నిర్ణయాలు ఉన్నాయని రెవ్ ఫీన్ సర్వీసెస్ (Revfin Services) సీఈవో, ఫౌండర్ సమీర్ అగర్వాల్ పేర్కొన్నారు.