కాగా ఇండియన్ ఈక్విటీ మీర్కెట్లు టీ ప్లస్ 1 సెటిల్మెంట్ సైకిల్‌ను ఎంచుకున్నాయి. అన్ని స్టాక్స్‌కు ఇది వర్తిస్తుంది. అంటే ఈ రోజు ట్రేడ్ చేస్తే.. రేపటి కల్లా డబ్బులు ఇన్వెస్టర్ల బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చి చేరతాయి. అలాగే ఈ రోజు షేర్లు కొంటే తర్వాతి రోజు కల్లా షేర్లు మీ డీమ్యాట్ ఖాతాలోకి వచ్చేస్తాయి. జనవరి 27 నుంచి ఈ టీ ప్లస్ 1 సెటిల్మెంట్ విధానం అమలులోకి వచ్చింది.
స్టాక్ మార్కెట్లో టీ ప్లస్ 1 సెటిల్మెంట్ పేమెంట్ విధానం ప్రపంచంలో తొలి సారిగా మన దేశంలోనే అమలులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విభాగంలో కూడా మార్పులు తెచ్చారు ట్రేడ్ సెటిల్మెంట్ ప్రక్రియను టీ ప్లస్ 3 నుంచి టీ ప్లస్ 2కు తగ్గించారు. అందువల్ల త్వరితగతిన సెటిల్మెంట్ పూర్తి అవుతుంది. డబ్బులు అందుబాటులోకి వస్తాయి.