1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇచ్చే కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి పెంచాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈపీఎఫ్ ఖాతాదారులకు రిటైర్మెంట్ తర్వాత కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే వస్తోంది. ప్రస్తుత అవసరాలకు ఈ పెన్షన్ సరిపోదని, పెంచాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. చాలా తక్కువ పెన్షన్, వైద్య సదుపాయాల కొరత కారణంగా EPS-95 పెన్షనర్ల మరణాలు పెరుగుతున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది కమిటీ. 15 రోజులలోపు కనీస పెన్షన్‌ను పెంచకపోతే రైలు, రోడ్డు మార్గాలను దిగ్బంధం, సామూహిక ఆమరణ నిరాహార దీక్ష, దేశవ్యాప్త ఆందోళన చేపడతాని హెచ్చరించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. నిర్ణీత వ్యవధిలో ప్రకటించిన డియర్నెస్ అలవెన్స్‌తో పాటు కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని కమిటీ డిమాండ్ చేసింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వాస్తవ జీతంపై పెన్షన్ చెల్లించాలని కూడా కోరింది. ఎక్కువ వేతనాలు ఉన్నవారు కూడా ఈపీఎస్-95 స్కీమ్‌కు కంట్రిబ్యూట్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు నవంబర్‌లో ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం కనీస వేతనం రూ.15,000 ఉన్నవారికి పెన్షన్ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేర్చబడని రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో సభ్యులుగా చేయడం ద్వారా EPS-95 కవరేజీని విస్తరించాలని కమిటీ డిమాండ్ చేసింది. 2012-13లో కోషియారీ కమిటీ సిఫార్సుల మేరకు కనీస పెన్షన్ పెంపుదల జరిగిందని అది సమర్పించింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈపీఎస్ పెన్షన్ 1995 నుంచి అమలులోకి వచ్చింది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా పెన్షన్ పొందేందుకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ నిర్వహిస్తోంది ఈపీఎఫ్ఓ. సంఘటిత రంగంలో పనిచేసే ప్రైవేట్ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ స్కీమ్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్లు సర్వీస్ ఉండాలి. వరుసగా పదేళ్ల సర్వీస్ లేకపోయినా ఫర్వాలేదు. కానీ మొత్తం సర్వీస్ 10 ఏళ్లు ఉండాలి. 10 ఏళ్ల సర్వీస్ ఉంటే సరిపోదు. 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. వారికి మాత్రమే 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)