1. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగులు కూడా పెన్షన్ పొందొచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పెన్షన్ ఇచ్చేందుకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) నిర్వహిస్తోంది. ఉద్యోగులు అందరికీ సామాజిక భద్రత అందించడమే లక్ష్యంగా ఈపీఎస్ స్కీమ్‌ను నిర్వహిస్తోంది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ స్కీమ్ ద్వారా సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు 58 ఏళ్లకు రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతీ నెలా పెన్షన్ పొందొచ్చు. అయితే ఈ పెన్షన్ పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈపీఎస్ పెన్షన్ 1995 నుంచి అందుబాటులోకి వచ్చింది. అప్పటికి ఉన్న, ఆ తర్వాత చేరిన ఈపీఎఫ్ ఉద్యోగులకు ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ స్కీమ్ ద్వారా ప్రైవేట్ ఉద్యోగులు పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్లు సర్వీస్ ఉండాలి. వరుసగా పదేళ్ల సర్వీస్ లేకపోయినా ఫర్వాలేదు. కానీ మొత్తం సర్వీస్ 10 ఏళ్లు ఉండాలి. 10 ఏళ్ల సర్వీస్ ఉంటే సరిపోదు. 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్‌లో కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. వారికి మాత్రమే 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక ఈపీఎస్ పెన్షన్ స్కీమ్‌లో జమ చేసిన మొత్తాన్ని డ్రా చేయాలనుకుంటే కనీసం 50 ఏళ్ల వయస్సు ఉండాలి. ఇక పెన్షన్ తీసుకోవడాన్ని 2 ఏళ్లు వాయిదా వేసినట్టైతే వారికి 60 ఏళ్ల వయస్సు నుంచి పెన్షన్ వస్తుంది. సంవత్సరానికి 4 శాతం చొప్పున ఈపీఎస్ పెన్షన్ పొందడానికి అర్హత పొందుతారు. ఒకవేళ ఉద్యోగి కంపెనీ మారితే పెన్షన్ వర్తిస్తుందా లేదా అన్న సందేహం ఉద్యోగుల్లో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కంపెనీ యాజమాన్యం జమచేసే 12 శాతంలో 3.67 శాతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో, 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో జమ అవుతుంది. 0.50 శాతం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్‌లో జమ అవుతుంది. ఈపీఎఫ్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జీలు 1.10 శాతం, EDLI స్కీమ్ అడ్మినిస్టేషన్ ఛార్జీలు 0.01 శాతం ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)