1. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం, నెల పాటు నిరుద్యోగిగా ఉంటే మీరు మీ ఖాతా బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు మనీని విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే రెండు నెలలపాటు నిరుద్యోగిగా (Unemployed) ఉన్నట్లయితే, మొత్తం పీఎఫ్ నిధులను (EPF Corpus) విత్‌డ్రా చేసుకోవడం చాలా ఈజీ. అయితే, ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బును విత్‌డ్రా చేస్తే పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరింత డబ్బు సంపాదించడానికి మీ పీఎఫ్ కార్పస్ (PF Corpus)ను లేదా నిధులను తాకకుండా ఉండటమే మంచిది. మీరు వేరొక ఆర్గనైజేషన్ కి చేంజ్ అయినప్పుడు ఆ సంస్థకు మీ పీఎఫ్ ఖాతాను బదిలీ (PF Account Transfer) చేసుకోవాలి. కానీ మనీ విత్‌డ్రా చేసుకుంటే మిస్టేక్ చేసినట్లే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
5. చాలామంది పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకుని వాటితో అనవసరమైన ఖర్చులు చేస్తారు. అలా కాకుండా తీసుకున్న పీఎస్ ని మళ్లీ తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు జాబ్ మానేసి వ్యాపారంలోకి అడుగు పెట్టినా.. 36 నెలల పాటు డబ్బుని ఖాతా నుంచి తీసుకోకపోవడం మంచిది. ఇలా చేస్తే అధిక మొత్తంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఒకవేళ సమయానికి ముందే ఈపీఎఫ్ డబ్బంతా విత్‌డ్రా చేసుకుంటున్నారంటే మీరు దానిని మార్కెట్-లింక్డ్ సెక్యూరిటీలలో లేదా కొంత రిస్క్‌తో కూడిన మంచి పెట్టుబడిలో పెట్టుబడి పెట్టాలి. ముఖ్య విషయం ఏంటంటే, ఒకసారి ఈపీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసిన కార్పస్‌ను తిరిగి ఈపీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం వీలు కాదని గుర్తించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)