EPF ఖాతాకు సంబంధించిన సమాచారం మోసగాళ్ల చేతిలో ఉంటే.. అప్పుడు వారు మీ ఖాతా నుండి డబ్బును దోచుకోవచ్చు. EPFO తన సభ్యుల నుండి ఆధార్, పాన్, UAN, బ్యాంక్ వివరాల సమాచారాన్ని ఎప్పుడూ అడగదని EPFO తెలిపింది. ఎవరైనా అలాంటి సమాచారాన్ని ఫోన్ లేదా సోషల్ మీడియాలో అడిగితే..జాగ్రత్తగా ఉండాలని.. వాటిని అస్సలు లీక్ చేయవద్దని కోరింది.(ప్రతీకాత్మక చిత్రం)
మోసగాళ్లకు ఇక్కడ ఒకేసారి భారీ మొత్తం లభిస్తుందని తెలుసు. కాబట్టి వారు ఫిషింగ్ దాడి ద్వారా ఖాతాపై దాడి చేస్తారు. వాస్తవానికి ఫిషింగ్ అనేది ఆన్లైన్ మోసం. దీనిలో డిపాజిటర్ మోసగించబడి ఖాతాకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని వారి నుండి పొందడంతో పాటు ఆపై ఖాతాలోని సొమ్మును దోచుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)