3. అనాథ పిల్లలకు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) కింద ఆర్థిక సహకారం లభిస్తుందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈపీఎస్ మెంబర్స్‌గా ఉన్నవారి పిల్లలకు మాత్రమే ఈపీఎఫ్ఓ నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇందుకు సంబంధించిన నియమనిబంధనల్ని వెల్లడించింది. అనాథ పిల్లలకు లభించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) బెనిఫిట్స్ గురించి వివరించింది. ఆ రూల్స్ గురించి ఓసారి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. వితంతులకు వచ్చే మంత్లీ పెన్షన్‌లో 75 శాతం అనాథ పిల్లలకు లభిస్తుంది. కనీసం రూ.750 నుంచి ఈ పెన్షన్ మొదలవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ నెలకు రూ.750 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అనాథ పిల్లలు వారి వయస్సు 25 ఏళ్లు వచ్చే వరకు ఈ పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ పిల్లలకు అంగవైకల్యం, ఇతర శారీరక లోపాలు ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) విషయానికి వస్తే ఉద్యోగి వేతనం నుంచి కంపెనీ డబ్బులు తీసుకోదు. కంపెనీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత భాగం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. కొత్త రూల్ ప్రకారం రూ.15,000 బేసిక్ వేతనం వరకు ఈ సదుపాయం పొందొచ్చు. ఈ రూల్ ప్రకారం వేతనంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. అంటే రూ.15,000 బేసిక్ వేతనం ఉంటే ఈపీఎస్‌లో రూ.1,250 జమ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)