అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) యూనిట్లలో పెట్టుబడుల ఉపసంహరణ అంశానికి సంబంధించి రిడెంప్షన్ పాలసీకి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. 2022-23 వడ్డీ రేటు లెక్కింపు కోసం ఆదాయంలో చేర్చడానికి క్యాపిటల్ గెయిన్లను బుకింగ్ చేయడం కోసం 2018 పీరియడ్ క్యాలెండర్ ఇయర్లో కొనుగోలు చేసిన ఈటీఎఫ్ యూనిట్ల విక్రయానికి బోర్డు ఆమోదించింది.