PF Withdrawal: ఉద్యోగులకు శుభవార్త.. అవసరానికి ఈజీగా డబ్బు పొందండిలా, రూ.1 తిరిగి కట్టక్కర్లేదు!
PF Withdrawal: ఉద్యోగులకు శుభవార్త.. అవసరానికి ఈజీగా డబ్బు పొందండిలా, రూ.1 తిరిగి కట్టక్కర్లేదు!
EPFO News | మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదంటే పిల్లల చదువు కోసం డబ్బుఅవసరం అయ్యిదా? లేదంటే అనారోగ్యం వచ్చిందా? చేతిలో డబ్బులు లేవా? ఇలా ఈజీగా డబ్బులు పొందొచ్చు. మళ్లీ తిరిగి కట్టాల్సిన పని లేదు.
Employees | మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ప్రతి నెలా డబ్బులు జమ చేస్తూ వస్తున్నారా? అయితే మీకు శుభవార్త. అయితే మీకు మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తంపై ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు మీ పీఎఫ్ డబ్బులను (Money) సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.
2/ 10
మీ అవసరాన్ని బట్టి మీకు వచ్చే విత్‌డ్రాయెల్ అమౌంట్ కూడా మారుతుంది. పెళ్లి చేసుకోవడానికి కూడా మీరు పీఎఫ్ (PF) అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చొ ఒకసారి తెలుసుకుందాం.
3/ 10
పీఎఫ్ విత్‌డ్రాయెల్ లేటెస్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం చూస్తే.. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు పెళ్లి ఖర్చుల కోసం డబ్బులు పొందొచ్చు. పీఎఫ్ అకౌంట్ దారుడు పెళ్లి చేసుకోవాలన్నా పీఎఫ్ డబ్బులు పొందొచ్చు. లేదంటే పీఎఫ్ అకౌంట్ కలిగిన వారి పిల్లల పెళ్లికి అయినా కూడా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
4/ 10
అయితే ఇక్కడ కండీషన్ ఉంది. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు 7 ఏళ్ల సర్వీస్ కలిగి ఉండాలి. అంటే కనీసం ఏడేళ్లు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చూస్తూ వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఈ బెనిఫిట్ పొందగలరు.
5/ 10
అయితే పీఎఫ్ అకౌంట్లోని పూర్తి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి వీలు లేదు. పీఎఫ్ బ్యాలెన్స్‌లో కనీసం 50 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందువల్ల మీకు డబ్బులు అవసరం అయితే ఈ ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు.
6/ 10
చేతిలో డబ్బులు లేకపోతే ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. బంధువుల నుంచి అప్పు తెచ్చుకోవడం, లేదంటే బ్యాంక్ నుంచి లోన్ పొందడం వంటివి లేకుండా ఇలా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం.
7/ 10
కాగా 2023 – 24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ విత్డ్రాయెల్స్పై టీడీఎస్‌ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించింది. పాన్ కార్డును పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేసుకోని వారు ఉంటే.. వారికి ఈ ప్రకటన వల్ల ప్రయోజనం కలుగుతుంది.
8/ 10
పాన్ కార్డు లేకపోతే గతంలో పీఎఫ్ విత్‌డ్రాయెల్‌పై 30 శాతం పన్ను పడేది. అయితే ఇకపై ఇప్పుడు ఇలా విత్‌డ్రాయెల్ చేసుకుంటే 20 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు ఐదేళ్లలోపు డబ్బులు విత్‌డ్రా చేసుకుంటేనే ఇలా ట్యాక్స్ పడుతుంది.
9/ 10
ఐదేళ్లు దాటితే మాత్రం ఎలాంటి పన్ను ఉండదు. అందువల్ల పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఐదేళ్ల తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమం. అత్యవసరం అయితే ఎప్పుడైనా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
10/ 10
పెళ్లికి మాత్రమే కాకుండా ఇతర ఆప్షన్ల కింద కూడా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. పిల్లల చదువు, ఎమర్జెన్సీ, ఇంటి నిర్మాణం ఇలా చాలా ఆప్షన్ల కింద డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. కోవిడ్ ఆప్షన్ కింద మనీ పొందొచ్చు.