1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు (UAN) మీ ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. యూఏఎన్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చాలా రోజులుగా అలర్ట్ చేస్తోంది. గతంలో 2021 సెప్టెంబర్ 1 లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంటే యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఈపీఎఫ్ అకౌంట్లో యజమాని వాటా జమ కాదు. నవంబర్ 30 లోగా యూఏఎన్, ఆధార్ లింక్ చేసినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్లో జమ అయ్యే యజమాని వాటా ఎప్పట్లాగే పొందాలనుకుంటే ఈ నెలాఖరు లోగా యూఏఎన్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి. యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar సెలెక్ట్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి. ఓసారి వివరాలు సరిచూసుకోవాలి. మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)