EPF WITHDRAWAL RULES CHANGED KNOW HOW TO WITHDRAW AMOUNT FROM EMPLOYEES PROVIDENT ACCOUNT SS
EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి స్టెప్స్ ఇవే
EPF Withdrawal | ఎంప్లాయీస్ ప్రావిడెట్ ఫండ్-EPF విత్‌డ్రా రూల్స్ మారిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంతో డబ్బులకు సమస్య ఉన్న ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ నుంచి అడ్వాన్స్ తీసుకునే సదుపాయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.
1. పీఎఫ్ విత్‌డ్రా నిబంధనల్ని కూడా మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75% లేదా మూడు నెలల వేతనం... వీటిలో ఏది తక్కువ అయితే అది నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. 4.8 కోట్ల మంది ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం కారణంగా ఉద్యోగులు ఎవరైనా డబ్బులు లేక ఇబ్బందులు పడితే వారు పీఎఫ్ నుంచి సులువుగా విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ఇదే కాకుండా ఇంటి నిర్మాణం, పెళ్లి లాంటి కారణాలకు ఇప్పటికే అడ్వాన్స్ తీసుకునే సదుపాయం ఉంది. ఈ కారణాలతో అడ్వాన్సులు తీసుకుంటున్నవారున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులు రిటైర్మెంట్ సమయంలోనే కాదు... అంతకన్నా ముందు కూడా ఉపయోగపడతాయి. మీ ఆర్థిక అవసరాలను బట్టి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. ఆన్లైన్లో మీరే స్వయంగా ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు. ఈపీఎఫ్ఓ ఈ అవకాశం కల్పిస్తోంది. సులువుగా క్లెయిమ్ సెటిల్మెంట్ జరిగేలా ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. గతంలో అయితే పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటే అందుకు గల కారణాలను వివరించడంతో పాటు డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉండేది. కానీ... ఇప్పుడు అలాంటి నిబంధనలేవీ లేవు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. మీరు ఆన్లైన్లో విత్‌డ్రా చేయాలనుకుంటే మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్‌తో లింకై ఉండాలి. ఇది తప్పనిసరి. మీ యజమాని ధృవీకరణ అవసరం లేదు. మీరే నేరుగా క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఇక మీ యూఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. మీ యూఏఎన్ అకౌంట్‌కు లింకైన మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి. ఆ తర్వాత మీరు యూఏఎన్ పోర్టల్ ఓపెన్ చేసి మీ వివరాలతో లాగిన్ కావాలి. ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. మీ క్లెయిమ్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 10-15 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి. అయితే కొన్ని కారణాలకు మాత్రమే ఈపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)