4. పెళ్లి: ఉద్యోగి లేదా తన సోదరి, సోదరుడు, పిల్లల పెళ్లిళ్లకు ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తంలో 50% వరకు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే గత ఏడేళ్లుగా ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఉండాలి. తన సర్వీస్ కాలంలో మూడుసార్లు పెళ్లి కారణంతో ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అది కూడా గరిష్టంగా 50% వరకే పరిమితం. (ప్రతీకాత్మక చిత్రం)
7. అనారోగ్యం: అనారోగ్య కారణాలు, వైద్య ఖర్చుల కోసం పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు ఇది వర్తిస్తుంది. 6 నెలల బేసిక్ సాలరీ, డీఏ లేదా ఉద్యోగి మొత్తం వాటాలో ఏది తక్కువ అయితే అది విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి లాక్-ఇన్ పీరియడ్, కనీస సర్వీస్ కాలం లాంటి నియమాలు వర్తించవు. (ప్రతీకాత్మక చిత్రం)