1. మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉందా? అయితే అలర్ట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇటీవల 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాలు ఈపీఎఫ్ ఖాతాదారులను ప్రభావితం చేసేవే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. అందుకే వారికి మేలు చేసేందుకు ఈపీఎఫ్ఓ పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాటు ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ తీసుకున్న నిర్ణయాల్లో సెకండ్ కోవిడ్ అడ్వాన్స్, నాన్ రీఫండబుల్ అడ్వాన్స్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్-EDLI లాంటి అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. మరి ఈపీఎఫ్ఓ తీసుకున్న 5 కీలక నిర్ణయాల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. EPF Aadhaar Seeding: ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయాలి. లేకపోతే యాజమాన్యం వాటా ఈపీఎఫ్ ఖాతాలో జమ కాదు. ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2021 మే 31న గడువు ముగిసింది. అయితే ఉద్యోగులకు మరో అవకాశం ఇస్తూ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది ఈపీఎఫ్ఓ. (ప్రతీకాత్మక చిత్రం)
4. Second Covid advance: గతేడాది కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో కోవిడ్ 19 ప్యాండమిక్ అడ్వాన్స్ సదుపాయాన్ని కల్పించింది ఈపీఎఫ్ఓ. అప్పుడు కోవిడ్ అడ్వాన్స్ తీసుకున్నవారు రెండోసారి కూడా అడ్వాన్స్ తీసుకునే అవకాశం ఇచ్చింది ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనం + డీఏ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. Medical advance: ఈపీఎఫ్ ఖాతాదారులు రూ.1,00,000 వరకు మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చని ప్రకటించింది ఈపీఎఫ్ఓ. కరోనాతో పాటు ఇతర వ్యాధులతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు రూ.1,00,000 మెడికల్ అడ్వాన్స్ పొందొచ్చు. అయితే ఆ పేషెంట్ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో ఉన్న ఆస్పత్రిలో చేరితేనే ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)