2. ఈపీఎఫ్ డబ్బుల్ని విత్‌డ్రా చేయడంలో సమస్యలు వస్తున్నాయి. దీంతో వారి క్లెయిమ్ సెటిల్మెంట్ మధ్యలోనే ఆగిపోతోంది. అందుకే ఉద్యోగులు ఈపీఎఫ్ క్లెయిమ్‌కు దరఖాస్తు చేసేముందు వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా 3 అంశాలను ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆ మూడు వివరాల్లో ఏది సరిగ్గా లేకపోయినా ఈపీఎఫ్ క్లెయిమ్ సాధ్యం కాదు. అందులో మొదటిది యూనివర్సల్ అకౌంట్ నెంబర్-UAN యాక్టివేట్ చేసి ఉండాలి. ఈపీఎఫ్ సభ్యులు తమకు యూఏఎన్ రాగానే ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. యూఏఎన్ యాక్టివేట్ చేయకుండా క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం కుదరదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రెండోది యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడంతో పాటు వెరిఫై చేయాలి. మూడోది బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్ యూఏఎన్‌తో లింక్ చేసి ఉండాలి. ఈ మూడూ కరెక్ట్‌గా ఉంటేనే ఈపీఎఫ్ క్లెయిమ్ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది. వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా క్లెయిమ్ సెటిల్మెంట్ పెండింగ్‌లోనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)