1. భారత ప్రభుత్వం రూపొందించిన యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్-UMANG యాప్ ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లను ఆకట్టుకుంటోంది. ఈపీఎఫ్ సేవల్ని ఉమాంగ్ యాప్‌లో సులువుగా పొందుతున్నారు సబ్స్క్రైబర్లు. ఎక్కువగా ఈపీఎఫ్ మెంబర్ పాస్‌బుక్ కోసం ఉమాంగ్ యాప్‌ను ఉపయోగిస్తున్నారని తేలింది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంటే కరోనా వైరస్ సంక్షోభం సమయంలో సుమారు మూడు రెట్లు ఎక్కువగా ఉమాంగ్ యాప్‌ను ఈపీఎఫ్ సేవల కోసం ఉపయోగించారు. ఇక 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య ఉమాంగ్ యాప్‌లో మెంబర్ పాస్‌బుక్‌ను 27.55 కోట్ల సార్లు చూస్తే, కరోనా సంక్షోభ కాలంలో 244.77 కోట్ల సార్లు చూశారు. అంటే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లు ఈపీఎఫ్ఓ సేవల కోసం ఎక్కువగా ఉమాంగ్ యాప్‌పైన ఆధారపడుతున్నారని అర్థమవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈపీఎఫ్ఓ పైన క్లిక్ చేయాలి. అందులో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత వ్యూ పాస్‌బుక్ పైన క్లిక్ చేయాలి. మీ యూఏఎన్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత మెంబర్ ఐడీ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ పైన పాస్‌బుక్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)